మెగా అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే నాడు ‘mega158’ నుంచి బిగ్ అప్డేట్!

by Mallepaka Hamsa |

ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు.

మెగా అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే నాడు  ‘mega158’ నుంచి  బిగ్ అప్డేట్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు.

ఇండస్ట్రీలోనే పేరుగాంచిన రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీన్ కోసం భారీ సంఖ్యలో ఫైటర్లను రంగంలోకి దించారు. మెగాస్టార్ చిరంజీవిని ఎంతో పవర్‌ఫుల్ అండ్ డైనమిక్ లుక్‌లో చూపించేలా ఈ ఫైట్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వయసులో కూడా చిరంజీవి ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటూ, కొన్ని రిస్కీ స్టంట్స్ స్వయంగా చేస్తుండటం విశేషం. థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను ఏమాత్రం రాజీ పడకుండా నిర్మిస్తున్నారట. ఇక మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా 'టైటిల్ టీజర్'ను మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న నాడు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Next Story