- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేతన్ హత్య కేసులో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్.. ఎంగేజ్మెంట్‌కి ముందే సియాకు పెళ్లి
వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో తవ్విన కొద్ది ఊహించని ట్విస్టులు బయటపడుతున్నాయి. కేతన్ అగర్వాల్‌తో ఎంగేజ్మెంట్ జరగకముందే సియా గోయల్‌కు ప్రియుడు చేతన్‌తో పెళ్లి జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది.

దిశ, వెబ్ డెస్క్: వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో తవ్విన కొద్ది ఊహించని ట్విస్టులు బయటపడుతున్నాయి. కేతన్ అగర్వాల్‌తో ఎంగేజ్మెంట్ జరగకముందే సియా గోయల్‌కు ప్రియుడు చేతన్‌తో పెళ్లి జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. సియా చేతన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కేతన్ తో ఎంగేజ్మెట్ కు సరిగ్గా నాలుగు నెలల ముందే వీరి వివాహం జరిగినట్టు నిర్దారించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సియా తన ప్రైవేట్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు కూడా గుర్తించారు. కానీ తరవాత ఆ ఫోటోలను డిలీట్ చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నట్టు సర్టిఫికెట్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పెళ్లికి సాక్షులుగా సంతకం చేసిన ఇద్దరు సియా స్నేహితులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే కేతన్ అగర్వాల్ తో సియాకు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్ లో వీరి పెళ్ళి నిశ్చయించారు. ఇంతలోనే సియా తన ప్రియుడితో కలిసి కేతన్ అగర్వాల్ ను జూన్ 18న లోహగడ్ కోటకు తీసుకెళ్లి కొండపై నుండి కిందకు తోసేసింది. కేతన్ అగర్వాల్ ను సియా హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హత్య తరవాత వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవ్వగా అవి చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎంగేజ్మెంట్ లో సియా చాలా సంతోషంగా కనిపించడం, తరవాత సియా పుట్టినరోజుకు కేతన్ సర్ప్రైజ్ లు ఇస్తూ ప్రపోజ్ చేయడం చూసి షాక్ అవుతున్నారు. ఇంతమంచివాడిని సియా ఎలా హత్య చేయగలిగింది అని తిట్టిపోస్తున్నారు. నిందిరాలిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.






