- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నేతవా లేక బీఆర్ఎస్ ఏజెంట్ వా?... ఈటల వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ కౌంటర్
కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి విడుదలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిన్న చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ మాట్లాడుతుంటే ఆయన బీజేపీ నేతలా మాట్లాడుతున్నారో, లేక బీఆర్ఎస్ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారో ప్రజలకే అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు తీయొద్దని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA)నే చెప్పిందన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా నీళ్లు విడుదల చేయొద్దని నిషేధించింది కేంద్ర ప్రభుత్వ సంస్థేనన్నారు. ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగి రావాలనన్నారు.
రెండు నాలుకల ధోరణి ఏంటి?:
ఈటల రాజేందర్ ఈ రెండు నాలుకల ధోరణి ఏంటి? అని ప్రశ్నించారు. ఆయన మాటల్లో బీజేపీ లైన్ ఉందా, బీఆర్ఎస్ స్క్రిప్ట్ ఉందా అనేది తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటే అని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు అది వంద శాతం నిజమని తేలిపోయిందన్నారు. ఢిల్లీలో దోస్తీ... గల్లీలో కుస్తీ అన్నట్టుంది వీరి వ్యవహారం కొనసాగుతోందని ప్రజా క్షేత్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న ఈ కపట నాటకాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా ఎండగడుతుందన్నారు. ఇక కేటీఆర్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కాదని అసలైన ఎక్స్‌పర్ట్స్ ఎన్‌డీఎస్‌ఏ వాళ్లేనన్నారన్నారు.






