వరదలో వైరాన్ని మర్చిన జీవులు.. వైరల్‌గా మారిన అరుదైన దృశ్యం

by Ramesh Naini |

ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రకృతి ఒక అద్భుతమైన జీవ సత్యాన్ని ఆవిష్కరించింది.

వరదలో వైరాన్ని మర్చిన జీవులు.. వైరల్‌గా మారిన అరుదైన దృశ్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రకృతి ఒక అద్భుతమైన జీవ సత్యాన్ని ఆవిష్కరించింది. విపత్కర పరిస్థితుల్లో మనుగడ కోసం చేసే పోరాటం ముందు వైరం ఏమాత్రం పనిచేయదని ఈ ఘటన నిరూపించింది.

ఒకే చోట చేరిన బద్ధశత్రువులు

వరద ముప్పు నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పాములు, కొంగ, ఎలుకలు, తాబేలు తమ సహజ సిద్ధమైన వైరాన్ని మరిచి ఒకే చోట ఆశ్రయం పొందాయి. ప్రాణ భయంతో ఉన్న ఆ జీవులు ఒకరికొకరు ఎలాంటి హాని చేసుకోకుండా ప్రశాంతంగా ఒకే దగ్గర ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

నెట్టింట వైరల్

ఈ అరుదైన దృశ్యం గుజరాత్‌లో కన్పించినట్లుగా తెలుస్తోంది. కానీ కచ్చితమైన ప్రదేశం తెలియరాలేదు. అయితే, ఓ వ్యక్తి వివరణ ఇస్తూ తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కష్టకాలంలో ప్రకృతి అందరినీ ఒకే వరుసలో నిలబెడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Next Story