TRS పేరు వివాదం.. కవితకు హైకోర్టు సంచలన ఆదేశం

by Prasad Jukanti |

తెలంగాణ రక్షణ సమితి (TRS) పార్టీ పేరు వివాదంపై ఈసీ నోటీసులకు సమాధానం ఇవ్వాలని కల్వకుంట్ల కవితను ఢిల్లీ హైకోర్టు ఆదేశించారు.

TRS పేరు వివాదం.. కవితకు హైకోర్టు సంచలన ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పేరు ఖరారు విషయంలో ఈసీ నోటీసులకు సమాధానం చెప్పాలని కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. టీఆర్ఎస్ పార్టీ పేరుపై పెద్ద ఎత్తన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని అందువల్ల పార్టీ పేరు కోసం ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కవితకు ఈసీ లేఖ రాసిన నేపథ్యంలో ఈసీ లేఖపై కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‍పై మంగళవారం విచారణ జరిపినన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం అంటే ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి తాము ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. జూన్ 23న ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు సరైన రీతిలో సమాధానం ఇవ్వాలని కవితను ఆదేశించింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ ఈ సమాధానంలో వివరణ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.

కోర్టులో ఇరుపక్షాల వాదనలు:

విచారణ సందర్భంగా ‘తెలంగాణ రక్షణ సమితి’ (TRS) పేరు రిజిస్ట్రేషన్‌పై తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయని కోర్టు ప్రస్తావించింది. అయితే, కవిత తరఫు న్యాయవాదులు ఈ వాదనను తోసిపుచ్చారు. పార్టీ పేరుపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, ఈ విషయంలో వ్యక్తిగతంగా వాదనలు వినిపించేందుకు (Personal Hearing) ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వలేదని కవిత న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, తాము అన్ని నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.

ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వండి:

వాదనలు విన్న అనంతరం ఢిల్లీ హైకోర్టు కీలక సూచన చేసింది. 'తెలంగాణ రక్షణ సమితి' అనేది పాత టీఆర్ఎస్ పార్టీ పేరును పోలి ఒకేలా కనిపిస్తోందని అభిప్రాయపడింది. అలాగే ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరు కూడా పాత టీఆర్ఎస్ అర్థం వచ్చేలాగే ఉందని పేర్కొంది. అందువల్ల ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు గడువులోగా సమాధానం ఇవ్వడంతో పాటు, పార్టీ పేరు కోసం కొన్ని ప్రత్యామ్నాయ పేర్లను (Alternative Names) ఎన్నికల సంఘానికి సమర్పించాలని కవితకు ఢిల్లీ హైకోర్టు సూచించింది.

Next Story