- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తుల కానుకలన్నీ భద్రం: అయోధ్య రామాలయ ట్రస్ట్ అధికారిక ప్రకటన
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అయోధ్య రామాలయ విరాళాల అక్రమాల వ్యవహారంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అయోధ్య రామాలయ విరాళాల అక్రమాల వ్యవహారంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల లెక్కలను తాజాగా తేల్చిన ట్రస్ట్.. విరాళాలు, ఆభరణాలన్నీ పూర్తిగా భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రస్ట్ అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేస్తూ భక్తుల అనుమానాలను పటాపంచలు చేసింది. ట్రస్ట్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. 31 మార్చి 2026 నాటికి రామాలయ ట్రస్ట్ ఆధీనంలో కింది స్థాయిలో నిధులు, ఆభరణాలు భద్రంగా ఉన్నాయి.
బంగారం: 23.259 కేజీలు
వెండి వస్తువులు: 1,518.925 కేజీలు
మీడియా సమక్షంలో 'మాయమైన' వస్తువుల ప్రదర్శన..
గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో, రాజకీయ వర్గాల్లో బంగారు రామచరితమానస్, వజ్రాల నెక్లెస్, వెండి పాదుకలు మాయమయ్యాయంటూ వస్తున్న వార్తలపై ట్రస్ట్ ఘాటుగా స్పందించింది. అవన్నీ తప్పుడు ప్రచారాలని కొట్టిపారేస్తూ.. సదరు విలువైన కానుకలను స్వయంగా మీడియా సమక్షంలో ప్రదర్శించింది. రాముడికి అందిన ప్రతి ఒక్క కానుక భద్రంగా భండాగారంలోనే ఉందని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రస్ట్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
తాత్కాలిక జనరల్ సెక్రటరీగా కృష్ణ మోహన్..
ఇదే సమయంలో ట్రస్ట్ అంతర్గత నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్రస్ట్ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా విశ్రాంత ఐఎఫ్ఎస్ (IFS) అధికారి కృష్ణ మోహన్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివాదాల నేపథ్యంలో పారదర్శకతను పెంచేందుకు, భక్తుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఈ నియమకం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు.. ఆలయ అంతర్గత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, విరాళాల సేకరణ, నిర్వహణలో ఎలాంటి లోపాలు తావులేకుండా చూసేందుకు ఒక ప్రత్యేక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)ను నియమించాలని ట్రస్ట్ నిర్ణయించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా కొత్త నాయకత్వం స్పష్టం చేసింది.






