- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు నేను ఇచ్చుకున్న బెస్ట్ గిఫ్ట్ అండాలను భద్రపరుచుకోవడమే.. కృతి షాకింగ్ కామెంట్స్
ముఖ్యంగా ‘మిమి’ సినిమా షూటింగ్ కోసం దాదాపు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చిన సమయంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్ వరుస హిట్లతో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇటీవల బరేలీ కి బర్ఫీ, మిమి, క్రూ, తేరే ఇష్క్ మే, కాక్‌టయిల్-2 వంటి చిత్రాల్లో నటించగా.. ఇవి బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించడం విశేషం. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కృతి సనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. మహిళల్లో వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ విషయంలో వచ్చే సమస్యలు, వయసు ఒత్తిడి గురించి యాంకర్ ప్రశ్నించగా.. కృతి సనన్ చాలా బోల్డ్‌గా సమాధానం ఇచ్చారు. తాను కొన్ని సంవత్సరాల క్రితమే తన అండాలను భద్రపరుచుకున్నట్లు ఆమె వెల్లడించారు. ముఖ్యంగా ‘మిమి’ సినిమా షూటింగ్ కోసం దాదాపు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చిన సమయంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇది అంత సులువైన ప్రక్రియ కాకపోయినప్పటికీ, భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుందని కృతి పేర్కొన్నారు.
సమాజం నిర్ణయించిన టైమ్‌లైన్ ప్రకారం పెళ్లి చేసుకోవాలని లేదా పిల్లలను కనాలని తాను ఎప్పుడూ అనుకోలేదని కృతి స్పష్టం చేశారు. పెళ్లి అయినా, పిల్లలైనా సరే మనసుకు అనిపించినప్పుడు, మనం మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలి తప్ప.. ఎవరో పెట్టే ఒత్తిడి వల్ల లేదా వయసు అయిపోతుందనే భయంతో చేయకూడదని చెప్పారు. ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది అందరికీ ఆర్థికంగా సాధ్యం కాకపోవచ్చునని, కానీ దాన్ని భరించే స్తోమత తనకు ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మనకు ఉన్నది ఒకటే జీవితమని, దాన్ని మనకు నచ్చినట్లుగా బతకాలని, మన జీవిత కథను మనమే రాసుకోవాలి తప్ప ఇతరులు కాదని కృతి సనన్ పేర్కొన్నారు. అండాలను భద్రపరుచుకోవడం తనకు తానే ఇచ్చుకున్న బెస్ట్ గిఫ్ట్ అని.. కానీ భవిష్యత్తులో వాటిని వాడతానో లేదో కానీ ముందు జాగ్రత్తగా ఫ్రీజ్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.






