- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సియోరా వెంచర్స్‌పై సమగ్ర విచారణకు ఆదేశం..
by Kodari Anjali |
పలు గ్రామాల్లో సియోర ఫామ్ లాండ్స్ పై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ అన్నారు.

X
దిశ, బొమ్మలరామారం: మండలంలోని మైలారం, మేడిపల్లి, ఫకీర్ గూడెం గ్రామాల్లో సియోర ఫామ్ లాండ్స్‌పై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ భాస్కరరావు అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వెంచర్స్ విషయంలో అనుమతులు ఉన్నాయా, నియమ నిబంధనల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు చెందాల్సిన స్థలాన్ని అప్పగించారా లేదా అని ఎంపీఓను అడిగారు. హెచ్ఎండీఏ , గ్రామపంచాయతీ అనుమతి పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. సీయోరా వెంచర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. నియమాలను అధిగమిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story






