పేదలు పిల్లల్ని కంటే పేదరికం పెరుగుతుంది.. మాధురీ జైన్ వ్యాఖ్యలపై నెటిజన్ల సీరియస్

by Prasad Jukanti |   (  Updated:2026-07-07 06:27:11  IST  )

పిల్లలు, పేదరికంపై మాధురి జైన్ వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో, ఆస్తి దానం చేయాలన్న నెటిజన్‌కు అశ్నీర్ గ్రోవర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

పేదలు పిల్లల్ని కంటే పేదరికం పెరుగుతుంది.. మాధురీ జైన్ వ్యాఖ్యలపై నెటిజన్ల సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పేదలు పిల్లల్ని కంటే పేదరికం పెరుగుతుందంటూ భారత్‌పే (BharatPe) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్నీర్ గ్రోవర్ భార్య మాధురి జైన్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ షో 'లాక్ అప్ 2' (Lock Upp 2) లో కంటెస్టెంట్‌గా ఉన్న మాధురి.. ఎలిమినేషన్ నుండి తప్పించుకునే క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. తాము మూడో బిడ్డను కనాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో మూడో బిడ్డ మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుందని షారుఖ్ ఖాన్‌తో సహా ధనవంతులందరినీకీ మూడో బిడ్డ ఉన్నారు. 'హమ్ దో హమారే దో' (మనం ఇద్దరం, మనకిద్దరు) అనే కాన్సెప్ట్ అందరికీ వర్తించదు. ధనవంతులు ఎక్కువ మంది పిల్లలను కంటే సంపద పెరుగుతుంది, అదే పేదవారు ఎక్కువ మంది పిల్లలను కంటే పేదరికం పెరుగుతుంది అని మాధురి వ్యాఖ్యానించారు. సంపదతో పిల్లల సంఖ్యను ముడిపెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.

ఇద్దరు పిల్లల కోసం రూ. 900 కోట్ల సంపద ఎందుకు?:

మాధురి చేసిన వ్యాఖ్యలు వైరల్‍గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే నళిని ఉనాగర్ అనే కంటెంట్ క్రియేటర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాధురి జైన్ భర్త అశ్నీర్ గ్రోవర్‌ను ట్యాగ్ చేస్తూ ఒక సవాల్ విసిరారు. కేవలం ఇద్దరు పిల్లల కోసం రూ. 900 కోట్ల సంపదను ఎందుకు దాచుకుంటున్నారు? మీ ఆస్తిని 1,800 కుటుంబాలకు తలా రూ.50 లక్షల చొప్పున దానం చేసి పేదరిక సమస్యను పరిష్కరించండి. అప్పుడు ఆ కుటుంబాలు తమ 3,200 మంది పిల్లలను సంతోషంగా పెంచగలుగుతాయి. ఆ తర్వాత మీ ఆస్తిని మొత్తం దానం చేసి హిమాలయాలకు వెళ్లి సన్యాసిగా మారండి. మీ ధనవంతులైన స్నేహితులకు కూడా ఇదే చెప్పండి అంటూ పోస్టు చేశారు.

అశ్నీర్ గ్రోవర్ స్ట్రాంగ్ రిప్లై:

నళిని చేసిన పోస్టుపై స్పందించిన అశ్నీర్ గ్రోవర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. నళిని చేసిన పోస్ట్‌ను ఉద్దేశిస్తూ 'అడుక్కోవడం లేదా విరాళాలు అడిగే పద్ధతి మరీ క్యాజువల్‌గా ఉంది. నా భార్య ఇప్పటికే మీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేసింది' అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఇక ఈ వివాదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ మాధురి గ్రోవర్ చాలా తెలివైన వ్యాఖ్యలు చేశారని, షోలోని కంటెస్టెంట్లలో ఆమె అంటేనే నాకు చాలా ఇష్టం అని మద్దతుగా నిలువగా మరొక యూజర్ తీవ్రంగా మండిపడ్డారు. సిగ్గుమాలినతనానికి ఒక ముఖం ఉంటే అది మీరే అని, ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మీ భార్యను భారత్‌పేలో ఇంటర్నల్ కంట్రోల్స్ ఆఫీసర్‌గా నియమించారు. ఆ తర్వాత ఆమెపై నకిలీ హెచ్ఆర్ బిల్లులు, ఇన్ఫ్లేటెడ్ వెండర్ ఇన్‌వాయిస్‌ల ఆరోపణలు ఉన్నాయంటూ ఆమె గతాన్ని గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. మొత్తంగా రిచ్ అండ్ పూర్ పీపుల్ సంతానం విషయంలో మాధురి జైన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

Next Story