మహిళపై దాడి.. బంగారు గొలుసు చోరికి విఫలయత్నం

by Kodari Anjali |

మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడు చోరీ చేసేందుకు విఫలయత్నం చేశాడు.

మహిళపై దాడి.. బంగారు గొలుసు చోరికి విఫలయత్నం
X

దిశ, వీణవంక: మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడు చోరీ చేసేందుకు విఫలయత్నం చేశాడు. ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన వేముల పద్మ(45) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి పద్మపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును చోరీ చేసేందుకు యత్నించాడు. కానీ మహిళ ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇంటికి సమీపంలో ఉన్న మహిళ కుటుంబ సభ్యులు రావడం గమనించిన వ్యక్తి తను తెచ్చుకున్న సెల్ ఫోన్ మరియు సైకిల్‌ను ఘటన స్థలంలోనే వదిలేసి పారిపోయాడు. దాడిలో బాధితురాలికి గాయాలయ్యాయని, దీనితో ఎస్సై రాత్రి ఘటన స్థలానికి వెళ్లి ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story