- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారును ఢీకొట్టిన టిప్పర్.. భారీగా ట్రాఫిక్ జామ్
by Kodari Anjali |
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వనస్థలిపురం: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డిపో సమీపంలో భాగ్యలత కమాన్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ లారీ, ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు అడ్డంగా తిరిగి, వెనుక భాగంతో పాటు ఒక వైపు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా హైవేపై భాగ్యలత - హయత్‌నగర్ రూట్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ మార్గంలో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది.
Next Story






