- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష్మీ బ్యారేజ్ (మేడిగడ్డ) వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
by Kodari Anjali |
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బ్యారేజ్ (మేడిగడ్డ) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది

X
దిశ, మహదేవపూర్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బ్యారేజ్ (మేడిగడ్డ) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం 9:00 గంటల సమయానికి అందిన వివరాల ప్రకారం.. బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం 100.00 మీటర్లు కాగా, ప్రస్తుతం +90.80 మీటర్ల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది.
బ్యారేజ్ మొత్తం నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు
ప్రస్తుతం బ్యారేజ్‌కు 1,22,440 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో (వరద నీరు) వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు బ్యారేజ్‌కు ఉన్న మొత్తం 85 గేట్లను పూర్తిగా ఎత్తివేయగా గోదావరి నది పూర్తిగా కిందకి కొనసాగుతోంది. ఎక్కడా నీటిని నిల్వ చేయకుండా వచ్చిన వరదను వస్తున్నట్లుగా దిగువకు వదులుతున్నారు. పరిస్థితిని నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Next Story






