- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెక్కన్ సిమెంట్ పరిశ్రమల ప్రమాదం కార్మికుడు మృతి
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు.

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం డెక్కన్ సిమెంట్ పరిశ్రమలోని లైన్-2లో ఫ్రీ హీటర్ టాప్ వద్ద కిల్న్ ఫీడ్ బకెట్ ఎలివేటర్ సమీపంలో జీఎన్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రేవూరి గ్రామానికి చెందిన భూతం వెంకట్రావు (45), తండ్రి నారాయణ, విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కప్లింగ్ తలకు బలంగా తగిలింది. తీవ్రగాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన గోపి వద్ద కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నట్లు సమాచారం. ఘటన పై మృతుడి భార్య భూతం పద్మ పాలకవీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాల పై విచారణ కొనసాగుతోంది.






