లక్కవరంలో అరుదైన పుంగనూరు దూడ సందడి!

by Ramesh Naini |

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం మండలం లక్కవరం గ్రామంలో అరుదైన పుంగనూరు ఆవు దూడ జన్మించింది.

లక్కవరంలో అరుదైన పుంగనూరు దూడ సందడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం మండలం లక్కవరం గ్రామంలో అరుదైన పుంగనూరు ఆవు దూడ జన్మించింది. కేవలం 12 అంగుళాల పొడవుతో పుట్టిన ఈ బుజ్జి దూడ స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ లేగదూడ.. వర్షిణి అనే చిన్నారితో ఎంతో మమేకమై, ఒక కుటుంబ సభ్యుడిలా ఇంట్లోనే ఆడుకుంటోంది.

ఎంతో అరుదైన ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు. చిన్నారి వర్షిణి ఈ ముద్దుల దూడను ఆప్యాయంగా ఎత్తుకుని మురిసిపోతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. జూన్ 20న ఈ దూడ పుట్టిందని, తన పేరు మహాలక్ష్మి అని పెట్టినట్లు చిన్నారి వర్షిణి తెలిపింది.

Next Story