- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే, కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ పాఠశాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న నాయక్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్‌తో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, హన్మకొండ కలెక్టరెట్: వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ పాఠశాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న నాయక్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్‌తో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రహరీ గోడ, కిటికీలు సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాలలో తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్స్ పరిసరాలను పరిశీలించి విద్యార్థినిలతో మాట్లాడి వారి విద్య సామర్ధ్యాలు స్వయంగా పరిశీలించారు.
కొన్ని రోజుల కిందట పాఠశాలలో ఓ విద్యార్థినికి కుక్కలు కరిచిన విషయం గోప్యంగా ఉంచిన విషయంలో ఎమ్మెల్యే, కలెక్టర్ సిబ్బందిపై మండిపడ్డారు. పాఠశాలలో ప్రహరీ గోడ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, నాణ్యమైన విద్య, వసతిగృహాల నిర్వహణపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యే తన వ్యక్తిగతంగా ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, తదితర సామాగ్రి పాఠశాల సిబ్బందికి అందజేశారు. విద్యార్థులకు బెడ్స్ కోసం కూడా తన వంతు సహాయం అందజేస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాల పరిసరాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో మున్సిపల్ అంధికారులను వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలో మళ్ళీ పాఠశాలను తనిఖీ చేస్తానని, అప్పటి వరకు పాఠశాలలో ఏ సమస్య ఉండకూడదని సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ అపర్ణ, డీసీవో సుధ, పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






