Venkyanil5 మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టిన వెంకటేష్.. కీలక షెడ్యూల్ షురూ

by Mallepaka Hamsa |

ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌లో విక్టరీ వెంకటేష్ అడుగుపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ ప్రత్యేక సెట్‌లో కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్నారట.

Venkyanil5 మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టిన వెంకటేష్.. కీలక షెడ్యూల్ షురూ
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీస్టారర్ మూవీ ‘#VenkyAnil5 , #NKRAR2’. ఇటీవల అనిల్ రావిపూడి-వెంకటేష్ కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తుండటంతో ఈ మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కళ్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఆయన ట్రెడిషనల్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం తాజాగా మూవీ మేకర్స్ ఓ క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌లో విక్టరీ వెంకటేష్ అడుగుపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ ప్రత్యేక సెట్‌లో కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్నారట. అయితే ఇందులో వెంకటేష్‌తో పాటు కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలు కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ కీలక షెడ్యూల్ సినిమా మొత్తానికి ఎంతో కీలకమైనదిగా చిత్ర యూనిట్ చెబుతోంది. ఇటీవల కళ్యాణ్ రామ్‌పై ఒక ప్రత్యేకమైన పాటను షూట్ చేసిన టీమ్.. ఇప్పుడు ఈ లెంథీ షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది. అయితే ఈ మూవీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట. అనిల్ రావిపూడి చిత్రాల్లో ఉండే వినోదం, కుటుంబ భావోద్వేగాలు, పండగ వాతావరణం అన్నీ కలబోసి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి 2027 కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Next Story