గురుకుల పార్ట్‌టైం పోస్టుల డెమోలు వాయిదా

by Taduka Kalyani |

పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్‌టైం జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, ఇతర పోస్టుల భర్తీ కోసం ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన డెమోలను వాయిదా వేసినట్లు జిల్లా సమన్వయ అధికారి కల్పన తెలిపారు.

గురుకుల పార్ట్‌టైం పోస్టుల డెమోలు వాయిదా
X

దిశ,సంగారెడ్డి అర్బన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్‌టైం జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, ఇతర పోస్టుల భర్తీ కోసం ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన డెమోలను వాయిదా వేసినట్లు జిల్లా సమన్వయ అధికారి కల్పన తెలిపారు. హైదరాబాద్‌లోని గురుకులాల సెక్రటరీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు డెమోలను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. డెమోల నిర్వహణకు సంబంధించి సంస్థ నిర్ణయించే కొత్త తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఆమె తెలిపారు. అభ్యర్థులు తదుపరి నోటిఫికేషన్ కోసం ఎదురుచూడాలని సూచించారు.

Next Story