- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో షాబాద్ లో ఉన్న ఎస్సీ హాస్టల్ విద్యార్థులు, షాబాద్ గ్రామస్తులందరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దిశ, షాబాద్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో షాబాద్ లో ఉన్న ఎస్సీ హాస్టల్ విద్యార్థులు, షాబాద్ గ్రామస్తులందరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు విద్యుత్ అధికారులు ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామంటూ గంటల తరబడి సమయం వృధా చేసి విద్యార్థులను,ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మండల కేంద్రంలోని మదర్ డైరీ మిల్క్ సెంటర్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లైన్ వెళ్లే చోట ఎస్సీ హాస్టల్ వెనకాల గాలి దుమారానికి ఒక పెద్ద చెట్టు విరిగి రోడ్డుపై పడింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఆ చెట్టును హాస్టల్ సిబ్బంది జెసిబి సాయంతో తొలగిస్తున్న సందర్భంలో ఒక వైరు తెగింది. వైరు తెగిన విషయాన్ని వెంటనే హాస్టల్ సిబ్బంది విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయించారు. విద్యుత్ అధికారులు. అప్పటినుంచి మరమ్మతులు చేయాలని గ్రామస్తులు, హాస్టల్ విద్యార్థులు ఎన్నిసార్లు కోరిన ఇప్పుడు వస్తున్నాం,అప్పుడు వస్తున్నామంటూ విద్యుత్ సిబ్బంది సమయం వృధా చేస్తూ కాలయాపన చేశారు. కాంట్రాక్టర్ కు సంబంధించిన కూలీలు హైతాబాద్ లో ఉన్నారని వారు అక్కడి నుంచి వచ్చే మరమ్మతులు చేయాలని చెప్తూ సమయం వృధా చేశారని గ్రామస్తులు తెలిపారు.
విద్యుత్ అధికారి లైన్మెన్లపై చర్యలు తీసుకోవాలి...
షాబాద్ లోని సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెబితే అక్కడ ఉన్న సిబ్బంది మాకు స్తంభాలు ఎక్కడం రాదు.. మీరు వేరే దారి చూసుకోండని చెప్పడంతో గ్రామస్తులు మరింత ఆగ్రహానికి గురి అయ్యారు. రాత్రి 9 గంటల 40 నిమిషాల సమయంలో గ్రామస్తులు అందరూ సబ్స్టేషన్ ముందు నిరసనకు దిగి ఆందోళన చేయడంతో విద్యుత్ అధికారులు మరమ్మత్తులు చేయడానికి సిబ్బందిని పంపించారు. మరమ్మతులు చేయడానికి సిబ్బందిని పంపించడానికి ఇంత సమయం పడుతుందా అని గ్రామస్తులు విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతుందని గంటకు రెండు మూడుసార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో గత వారంలో ఒక నిండు ప్రాణం బలి అయిందని, అలా జరిగినప్పటికీ విద్యుత్ అధికారులు కళ్ళు తెరవడంలేదని చెబుతున్నారు. నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. షాబాద్ గ్రామంలో ఉన్న లైన్మెన్లు అందరూ విద్యుత్ సమస్య ఏదైనా తలెత్తితే మరమ్మతులు చేయడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని, వాళ్ల గురించి షాబాద్ ఏఈ కి తెలిసినా కానీ పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి షాబాద్ మండల విద్యుత్ అధికారి లైన్మెన్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






