దేశంలోనే అత్యుత్తమ డిజైన్.. ముస్తాబైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు: రామ్మోహన్ నాయుడు

by Ramesh Naini |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్‌ సంస్థల సమన్వయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తయిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

దేశంలోనే అత్యుత్తమ డిజైన్.. ముస్తాబైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు: రామ్మోహన్ నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్‌ సంస్థల సమన్వయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తయిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. మంగళవారం విమానాశ్రయ పనుల తుది మెరుగులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో నిర్ణీత సమయానికే జీఎంఆర్ సంస్థ ఎయిర్‌పోర్టును నిర్మించిందన్నారు. ఇప్పటికే విమానాశ్రయానికి ఎయిరో డ్రో లైసెన్స్ వచ్చిందని, త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారు కాగానే ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రారంభమైన వారం తర్వాత విశాఖ విమానాశ్రయ కార్యకలాపాలను భోగాపురానికి తరలించి ఆపరేషన్స్ ప్రారంభిస్తామన్నారు.

దేశంలోనే అత్యుత్తమ డిజైన్..

రాబోయే రోజుల్లో ఏకంగా 4 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టుగా 78,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ నిర్మించినట్లు మంత్రి వివరించారు. ఉత్తరాంధ్ర కళలు, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఇంటీరియర్ డిజైన్ చేశామని, డిజైన్ పరంగా ఇది దేశంలోనే బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా నిలుస్తుందని ఆయన కితాబిచ్చారు.

శ్రీకాకుళంలో పార్కులకు శంకుస్థాపన..

అంతకుముందు శ్రీకాకుళం జిల్లా గూనపాలెం, హడ్కో కాలనీలలో పార్కుల నిర్మాణానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు శంకుస్థాపన చేశారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ అందించిన రూ.2 కోట్ల సీఎస్ఆర్ (CSR) నిధులతో ఈ పార్కులను నిర్మిస్తున్నారు. ఈ పనులను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పార్కుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Next Story