రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్న నిఖిల్.. ఫ్యూచర్‌లో ట్రస్ట్ కూడా పెడతామంటూ కామెంట్స్

by Chukka Sudharani |

యంగ్ హీరో నిఖిల్ రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నాడు.

రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్న నిఖిల్.. ఫ్యూచర్‌లో ట్రస్ట్ కూడా పెడతామంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో నిఖిల్ రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నాడు. తాజాగా 1000 మంది స్కూల్ పిల్లలకు బుక్స్ కిట్ అందిచాడు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్య క్రమం కోసం ఈ రోజు భీమవరం వచ్చాము. 1వ తరగతి నుంచి 5వ తరగతి ఎలిమెంట్రీ స్కూల్ పిల్లలకు ఆల్మోస్ట్ ఒక 1000 మంది పిల్లలకు ఈ రోజు స్టేషనరీ కిట్స్, చదువుకోవడానికి కావాల్సిన ఒక గిఫ్ట్ యాంపర్ లాంటివి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం హైదరాబాద్‌లో చేసే వాడిని.. ఇప్పుడు అన్నీ ప్రాంతాల్లో చేయాలని ఇక్కడ స్టార్ట్ చేశాము. అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.

నేను సినిమాల్లోకి రాక ముందు స్కూల్లో ఎలా చదువుకునే వాడిని, చదువు వల్లే ఈ రోజు ఇంతటి వాడిని అయ్యాను.. ఫ్యూచర్‌లో ఎవరి ఏమి అవ్వాలనుకున్నా చదువు చాలా ఇంపార్టెంట్ అని నా స్టోరీనే పిల్లలకు చెప్పాను. వాళ్లతో మాట్లాడి వాళ్లను ప్రోత్సాహంచాము. ఇలా బుక్స్, పెన్స్, వాళ్లు చదువుకోవడానికి అవసరమైన ప్రతిది ఇవ్వడం సంతోషంగా ఉంది. మేము ఏదో చేసేస్తున్నాము అని కాదు.. వాళ్లకు ఎంకరేజ్మెంట్‌గా ఉంటుదని చేశాము. ఒక యాక్టర్‌గా స్క్రీన్ మీదే కాదు.. సొసైటీకి ఏదో ఒకటి రిటర్న్ ఇవ్వాలి ఈ ప్రయత్నం. 1000 కిట్స్ ఇలా ప్రిపేర్ చేసి, అందివ్వడానికి నా వెనకుండి నడిపించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు.

అలాగే భవిష్యత్తులో ట్రస్ట్ పెట్టే ఆలోచన ఉందా అనే ప్రశ్నపై నిఖిల్ స్పందిస్తూ.. ‘ట్రస్ట్ అనేది పెడతాము. అయితే ట్రస్ట్ పెట్టినప్పుడే సేవ చేయాలని కాదు కదా. ఏదో నా వంతుగా చేశా. అలాగే కోవిడ్ టైమ్‌లో కూడా నాకు అనిపించింది చేశాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా పబ్లిసిటీ లేకుండానే చేసేవాడిని. నాకు అర్థం అయింది ఏంటంటే.. నేను చాలా మందిని చూసి ఇన్స్‌పెయిర్ అయ్యా. అలాగే నన్ను చూసి కూడా ఎంతోకొంత మంది అవుతారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ బుక్స్ కిట్స్‌పై స్వయంభు సినిమా పోస్టర్ ఉండటం విశేషంగా ఆకట్టుకుంటోంది.

Next Story