- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీఎన్పీడీసీఎల్ చారిటీ రూ.20,000 ఆర్థిక సహాయం..
టీజీఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టి ఎన్జీఓలను ప్రోత్సహిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి తెలిపారు.

దిశ, మంగపేట: టీజీఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టి ఎన్జీఓలను ప్రోత్సహిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి తెలిపారు. మంగళవారం మండలంలోని కస్తూరిబాయి మహిళా ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమానికి ప్రతి నెల రూ.20,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. కస్తూరిబాయి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన అధికారులు మాట్లాడుతూ.. సమాజ సేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించేందుకు టీజీఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెలా రూ.20వేల ఆర్థిక సహాయం సమాజ సేవలో ఉన్న ఎన్జీఓలను గుర్తించి అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్జీఓలు ఈ నిధులను సేవా కార్యక్రమాల విస్తరణకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ నిర్వాహకురాలు సామ్రాజ్యం, ఏఈ కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి యానయ్య, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేంద్రబాబు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య, నాగార్జున పాల్గొన్నారు.






