విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం...

by Kodari Anjali |

వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన ఓ రైతును విద్యుత్ రూపంలో మృత్యువు కాటేసింది.

విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం...
X

దిశ, ముత్తారం: వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన ఓ రైతును విద్యుత్ రూపంలో మృత్యువు కాటేసింది. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన మారం వెంకటరెడ్డికి పారుపల్లి శివారులో వ్యవసాయ భూమి ఉంది. మంగళవారం ఉదయం తన పొలంలో పనులు చేస్తున్నాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేసేందుకు వెంకటరెడ్డి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో ఆయన తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే అక్కడికి చేరుకునేలోపే.. వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం ఆరోగ్యంగా పొలానికి వెళ్లిన వ్యక్తి, కొద్దిసేపటికే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ముత్తారం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story