- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజాంపట్నం తీరానికి కొట్టుకొచ్చిన భారీ ‘నావిగేషన్ బోయ్’
by Ramesh Naini |
బాపట్ల జిల్లా నిజాంపట్నం సముద్ర తీరానికి ఓ భారీ నావిగేషన్ బోయ్ కొట్టుకొచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బాపట్ల జిల్లా నిజాంపట్నం సముద్ర తీరానికి ఓ భారీ నావిగేషన్ బోయ్ (Navigation Buoy) కొట్టుకొచ్చింది. నీటిపై బెలూన్‌లా తేలియాడుతున్న ఈ పరికరాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. చెన్నై పోర్టు వద్ద వాతావరణ సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ పరికరం ప్రమాదవశాత్తు విడిపోయి అలల ఉధృతికి నిజాంపట్నం తీరానికి చేరుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. సుమారు రూ. 70 లక్షల విలువైన ఈ నావిగేషన్ బోయ్‌ను చెన్నై అధికారుల విజ్ఞప్తి మేరకు ఇక్కడి అధికారులు లారీలో తిరిగి అక్కడికి సురక్షితంగా పంపించారు.
Next Story






