ఆళ్లపల్లి కాంగ్రెస్‌లో పెద్దలకు షాక్.. యువ నేతకే మండల పగ్గాలు

by Kodari Anjali |

ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ నాయకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఆళ్లపల్లి కాంగ్రెస్‌లో పెద్దలకు షాక్.. యువ నేతకే మండల పగ్గాలు
X

దిశ, ఆళ్లపల్లి: ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ నాయకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసి, మండల స్థాయిలో కీలకంగా వ్యవహరించిన సీనియర్లను పక్కనబెట్టి, యువ నాయకుడికే అధిష్ఠానం పట్టం కట్టింది. ఈ పరిణామంతో మండల కాంగ్రెస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. గత 15 ఏళ్లుగా మండలంలో పార్టీ బాధ్యతలు మోసిన సీనియర్ నేతలు ఈసారి కూడా అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ జిల్లా నాయకత్వం మాత్రం "యువ రక్తం" వైపే మొగ్గు చూపింది. 30-35 ఏళ్ల మధ్య వయసున్న, గత ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ తరఫున చురుగ్గా పనిచేసిన యువ నేతకు మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో సీనియర్లు ఖంగుతిన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీస్ కేసులు, నిర్బంధాలు ఎదుర్కొని పార్టీని కాపాడింది మేమని అంటున్నారు. మరోవైపు, కొత్త అధ్యక్షుడి ఎంపికతో యువ కార్యకర్తల్లో జోష్ నెలకొంది. సోమవారం మండల కేంద్రం నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు కలిసి వచ్చారు. దాంట్లో సీనియర్లు కనిపించకపోవడంతో ఈ చర్చ జరుగుతుంది. అసలు సవాల్ ఇప్పుడే మొదలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీనియర్ల అనుభవాన్ని, యువత దూకుడును కలిపి పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారనేది కొత్త అధ్యక్షుడికి అసలైన పరీక్ష. సీనియర్ల అసంతృప్తిని చల్లార్చి అందరినీ కలుపుకొని వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి.

Next Story