- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ మేయర్ పీఠమే లక్ష్యం.. పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు
రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులకన్నాకాంగ్రెస్ నేతలు మేయర్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా వద్దంటూ మేయర్ పీఠంపై గురి పెట్టారు. మేయర్ స్థానం ఈ దఫా జనరల్ కు రిజర్వు కావడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు పదవి కోసం పట్టుబడుతున్నారు. దీంతో పోటీ సైతం ఎక్కువగానే ఉంది. మేయర్‌పీఠం కోసం సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిని కలవడంతో పాటు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఎమ్మెల్యేలు కూడా తమ వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పూర్తిస్థాయిలో నజర్ పెట్టడంతో ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. మొత్తంగా బల్దియా ఎన్నికలు వ్యవహారం నోటిఫికేషన్‌కు ముందే రాజకీయవేడి రాజుకుంటుంది.
దిశ, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ రాజకీయం రాష్ట్ర రాజధాని వేదికగా కొనసాగుతుంది. గ్రేటర్ పరిధిలో త్వరలో జరిగే ఎన్నికలే లక్ష్యంగా సీనియర్ నేతలు కదులుతున్నారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులకంటే మేయర్ పీఠం వైపే మొగ్గు చూపుతున్నారు. తమకు దగ్గరగా ఉన్న నేతల ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ నగర మేయర్ స్థానం ఈసారి జనరల్ కు రిజర్వు అయ్యింది. కొన్నేళ్లుగా అవకాశం ఎవరికి రాలేదు. ఈ దఫా జనరల్ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపుతున్నారు. మేయర్ పీఠంకు పోటీగా ఉండటంతో పాటు ముందే ప్రకటన చేయించి పోటీలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్ నగరం నాలుగు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒకరు మంత్రిగా కొనసాగుతుండగా, ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రెండవ దఫా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు మొదటి విడత నేటితో పూర్తవుతున్నాయి. వీరిలో కొద్దిమందికి రెండవ విడతకు అవకాశం ఇవ్వనున్నారు.
ఇప్పటి వరకు రెండవ విడతలో...
ఉమ్మడి జిల్లా నుంచి రాజయ్య, జంగా రాఘవరెడ్డి, రియాజ్, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, బెల్లయ్య నాయక్, అయిత ప్రకాష్ రెడ్డి ఉన్నారు. వీరిలో రాజయ్యకు ఇప్పటికే రెండవ విడత రెన్యూవల్ చేశారు. మిగతా ఐదుగురిలో ఒక్కరు లేదా ఇద్దరికి అవకాశం ఇచ్చి మిగతా వారికి ఛాన్స్ మిస్ కానున్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగిసి రెండు నెలలు దాటింది. ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా ప్రకటించగానే డిసెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు రెండవ విడతలో నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేసిన కొంత మంది నేతలు మేయర్ పీఠంపై కన్నేశారు. సుమారు 30 ఏళ్లకు పైగా పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు ఈ దఫా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జనరల్ గా రిజర్వు కావడంతో ఎవరికి వారే రాష్ట్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులను కలుస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ కన్న మేయర్ గా అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో పనిచేస్తామని వివరిస్తున్నారు.
జనరల్ సీటు రావడంతో..
ఎమ్మెల్యేలు కూడా తమ వారసులను రంగంలోకి దించారు. కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ లో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కీలకమైనది. దీని పరిధిలో మేయర్ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. రాష్ట్రస్థాయి నేతలు, మంత్రులు నగరానికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పూర్తిస్థాయిలో నజర్ పెట్టడంతో ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. జనరల్ సీటు రావడంతో మేయర్ పీఠమే లక్ష్యంగా రాజకీయ కార్యకలాపాలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో కీలకమైన ఈ మేయర్ పీఠంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే ఎంపిక ఉండనుండటంతో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్ నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉండటం, కోట్ల రూపాయల నిధులు ఉండటం, పనిచేసే అవకాశం ఉండటంతో పోటీ పెరుగుతుంది. కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో పట్టు ఉంటే భవిష్యత్ రాజకీయాలకు పనికి వస్తుందని నేతలు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే ఎంపిక జరిగే అవకాశం ఉంది.






