ఎవరినీ మెప్పించడానికి నేను రాలేదు.. రూల్స్ బ్రేక్ చేసి ముద్ర వేయడానికి వచ్చానంటూ అవికా గోర్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-24 05:51:22  IST  )

ఈ పాత్రతో సినిమా నియమాలను బ్రేక్ చేస్తున్నాను. ఇందులో హీరో ఆరాధన లేదు, రక్షణ కవచాలు లేవు. లోపాలతో, ఉగ్రంగా, అత్యంత వాస్తవికంగా నా పాత్ర ఉంటుంది.

ఎవరినీ మెప్పించడానికి నేను రాలేదు.. రూల్స్ బ్రేక్ చేసి ముద్ర వేయడానికి వచ్చానంటూ అవికా గోర్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అవికా గోర్ కెరీర్ మొదట్లో ‘చిన్నారి పెళ్లికూతురు’గా బుల్లితెరపై మెప్పించిన ఈమె, ఇప్పుడు వెండితెరపై ప్రయోగాత్మక చిత్రాలతో అలరిస్తోంది. గత ఏడాది ‘షణ్ముఖ’ మూవీతో మెప్పించిన అవికా, ఇప్పుడు హీరో నందు సరసన ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ‘అగ్లీ స్టోరీ’. పేరుకు తగ్గట్టే ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. సమ్మర్ కానుకగా మే 16న ‘అగ్లీ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అవికా గోర్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

"ఈ పాత్రతో సినిమా నియమాలను బ్రేక్ చేస్తున్నాను. ఇందులో హీరో ఆరాధన లేదు, రక్షణ కవచాలు లేవు. లోపాలతో, ఉగ్రంగా, అత్యంత వాస్తవికంగా నా పాత్ర ఉంటుంది. ఎవరినీ మెప్పించడానికి నేను రాలేదు.. నాదైన ముద్ర వేయడానికి వచ్చాను" అంటూ అవికా తన క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చింది.సినిమా ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పోస్టర్‌లో చీరకట్టులో ఉన్న అవికాను నందు కోపంతో గట్టిగా హత్తుకుని ఉండగా, ఆమెను చెట్టుకొమ్మలతో బంధించినట్లు చూపించారు. అవికా కళ్ళలో కనిపిస్తున్న బాధ, నందు ముఖంలో కనిపిస్తున్న తీవ్రత ఈ సినిమా కథ ఎంత ఇంటెన్సివ్‌గా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది.ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడూ సాఫ్ట్ పాత్రలు చేసే అవికా, ఇలాంటి రఫ్ అండ్ వాస్తవిక పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

నేను ఆ విషయాలు బయటపెడితే కాపురాలు కూలిపోతాయి.. గీతా మాధురి సెన్సేషనల్ కామెంట్స్

Next Story