నేను ఆ విషయాలు బయటపెడితే కాపురాలు కూలిపోతాయి.. గీతా మాధురి సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నేను ఎప్పుడో ఒకసారి కాఫీ షాప్‌కి వెళ్తాను. ఆ రోజే ఎవరో ఒక ప్రేమ జంట అక్కడికి వచ్చి నాకు దొరికిపోతారు. నేను వెళ్లినప్పుడే ఇలా జరగడం యాదృచ్ఛికం.

నేను ఆ విషయాలు బయటపెడితే కాపురాలు కూలిపోతాయి.. గీతా మాధురి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ సింగర్ గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. గాయకుడు నోయెల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న ఆమె, సరదాగా మాట్లాడుతూనే బాంబ్ పేల్చారు. తను కాఫీ షాప్‌కు వెళ్లినప్పుడు చాలాసార్లు ప్రముఖ ప్రేమ జంటలను 'రెడ్ హ్యాండెడ్‌గా' చూశానని, ఒకవేళ తను చూసిన విషయాలను బయటపెడితే చాలామంది కాపురాలు కూలిపోతాయని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గీతా మాధురి, నోయెల్ ఇంటర్వ్యూ ప్రోమోలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను ఎప్పుడో ఒకసారి కాఫీ షాప్‌కి వెళ్తాను. ఆ రోజే ఎవరో ఒక ప్రేమ జంట అక్కడికి వచ్చి నాకు దొరికిపోతారు. నేను వెళ్లినప్పుడే ఇలా జరగడం యాదృచ్ఛికం. నేను చూసిన వాటి గురించి నోరు తెరిస్తే కాపురాలు కూలిపోవడం ఖాయం" అని ఆమె నవ్వుతూ చెప్పడం ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గీతా మాధురి ఆ మాట అన్నప్పుడు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఆమె చూసిన ఆ సీక్రెట్ కపుల్స్ టాలీవుడ్ సెలబ్రిటీలేనా లేక తన వ్యక్తిగత సర్కిల్‌కు చెందినవారా? అన్న చర్చ మొదలైంది. పూర్తి ఎపిసోడ్ విడుదలయ్యే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది. ఒకవైపు తన పాటలు, టీవీ షోలు, మరోవైపు నందు భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉండే గీత, ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Next Story