నా పాపాలన్నింటినీ కడిగివేయడానికి సమయం ఆసన్నమైంది.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-14 05:39:59  IST  )

తన పాపాలన్నీ కడిగేసేలా, అందరినీ షాక్‌కు గురిచేసే సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు ఆర్జీవీ తెలిపారు.

నా పాపాలన్నింటినీ కడిగివేయడానికి సమయం ఆసన్నమైంది.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్‌లో పొలిటికల్ క్రైమ్ డ్రామాలకు కొత్త అర్థం చెప్పిన తన పాపులర్ ఫ్రాంచైజీ ‘సర్కార్’ నుంచి నాలుగో భాగాన్ని ప్రకటించారు. ముంబైలో జరిగిన 'రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్'లో పాల్గొన్న వర్మ, త్వరలోనే ‘సర్కార్ 4’ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. "నేను ‘సర్కార్ 4’ చేస్తున్నాను. వచ్చే నెల నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది" అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో అమితాబ్ బచ్చన్ మరోసారి 'సుభాష్ నాగ్రే'గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమైంది. దీనితో పాటు తన పాపాలన్నీ కడిగేసేలా, అందరినీ షాక్‌కు గురిచేసే సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపారు.

ఆ చిత్రం పేరు సిండికేట్ అని అన్నారు. వర్మ తన కెరీర్ లోని కల్ట్ క్లాసిక్ ‘శివ’ సినిమా గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "శివ సినిమాలో కొన్ని షాట్స్ తీయడానికి నాకు లెజెండరీ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ టేకింగ్ స్టైల్ స్ఫూర్తినిచ్చింది. అలాగే బ్రూస్ లీ నటించిన ‘ది వే ఆఫ్ ది డ్రాగన్’ సినిమా నేపథ్యాన్ని తీసుకొని, మన నేటివిటీకి తగ్గట్టుగా ‘శివ’గా మార్చాను" అని తన మేకింగ్ సీక్రెట్స్ బయటపెట్టారు. ప్రస్తుత తరం దర్శకుల్లో ఆదిత్య ధర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన తీస్తున్న ‘ధురంధర్ 2’ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వర్మ తెలిపారు. ఇప్పటికీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకుడు స్పిల్ బర్గ్ మాత్రమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ‘సర్కార్ 4’ ప్రకటనతో సోషల్ మీడియాలో మెగాస్టార్ బిగ్ బి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఆదిత్య ధర్ పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

Next Story