- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఒత్తిడిని భరించలేకపోయానంటూ వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. షాకింగ్ వీడియో వైరల్
నా ప్రతి పనిని నాన్న ఎంతో శ్రద్ధగా గమనించేవారు. నా మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ చూసి ఆయన నన్ను ఎంతో మెచ్చుకున్నారు.

దిశ, సినిమా: హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్లామరస్ ఎంట్రీ ఇచ్చి యూత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ, ఆ తర్వాత ‘మంగళవారం’ వంటి వైవిధ్యమైన చిత్రంతో తన నటనలోని మరో కోణాన్ని చూపించింది. ప్రస్తుతం ఈమె తన బాయ్‌ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్న ‘ఫస్ట్ టైమ్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాయల్ చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేయడమే కాకుండా, అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఈ వెంట్ మధ్యలో పాయల్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకుంది. గత కొంతకాలంగా తన కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను తలుచుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
"మా నాన్న క్యాన్సర్ బారిన పడటం మా కుటుంబానికి అత్యంత కష్టకాలం. ఒకవైపు ఆయన ఆరోగ్యం క్షీణించడం, మరోవైపు ఆ మానసిక వేదన నన్ను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఆ బాధను భరించలేక నేను జైపూర్‌లో విపాసన ధ్యానం కోసం కూడా వెళ్లాను. అది నాకు కొంచెం ఊరటనిచ్చింది" అని పాయల్ చెప్పుకొచ్చింది. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. "నా ప్రతి పనిని నాన్న ఎంతో శ్రద్ధగా గమనించేవారు. నా మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ చూసి ఆయన నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి చనిపోయి అప్పుడే ఏడాది కావస్తోంది" అని చెబుతూ పాయల్ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ బాధలో ఆమె ఈవెంట్ మధ్యలోనే స్టేజ్ పై నుండి వెళ్ళిపోవడం అక్కడ ఉన్న వారందరినీ కలిచివేసింది. తండ్రిని కోల్పోయిన బాధ నుండి పాయల్ ఇంకా కోలుకోలేదని ఈ సంఘటనతో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.






