- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు నాకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదు.. ఆలోచించే శక్తి లేక నో చెప్పా: ఫరియా అబ్దుల్లా
తన కెరీర్‌లో ఇప్పటికీ బాధపడే విషయం ఏదైనా ఉందంటే అది ‘హనుమాన్’ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేయడమేనని ఫరియా ఓపెన్ అయింది.

దిశ, సినిమా: జాతిరత్నాలు’ సినిమాలో ‘చిట్టి’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు, తనదైన నటన, చలాకీతనంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ‘గాయపడ్డ సింహం’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఫరియా వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా తన కెరీర్‌కు సంబంధించి ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కెరీర్‌లో ఇప్పటికీ బాధపడే విషయం ఏదైనా ఉందంటే అది ‘హనుమాన్’ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేయడమేనని ఫరియా ఓపెన్ అయింది. "నేను హనుమాన్ సినిమా ఆఫర్ వస్తే కాదన్నాను. అది నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. అప్పుడు నాకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదు, ఆలోచించే శక్తి లేక నో చెప్పాను" అని తనను తానే తిట్టుకుంది. అప్పటికే ‘జాతిరత్నాలు’ భారీ విజయం సాధించడంతో, తదుపరి పాత్రల ఎంపికలో అతిగా ఆలోచించి పొరపాటు చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను తాను అప్పట్లో సరిగ్గా అంచనా వేయలేకపోయానని ఫరియా తెలిపింది. "నేను కొత్తగా ఇండస్ట్రీకి రావడం వల్ల అప్పట్లో అంత మెచ్యూరిటీ లేదు. పాత్ర గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను. ఇప్పటికీ దర్శకుడు ప్రశాంత్ వర్మ లేదా హీరో తేజ సజ్జ కలిసినప్పుడు.. అంత మంచి సినిమాను మిస్ చేసుకున్నందుకు చాలా బాధగా ఉందని చెబుతుంటాను" అని తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఫరియా ఆశలన్నీ ‘గాయపడ్డ సింహం’ సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రంలో ఆమె ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తన కెరీర్‌లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, ఇకపై స్క్రిప్ట్ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని ఆమె స్పష్టం చేసింది.






