- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి చేసుకోకుండా ఉండగలను.. కానీ ఆ పనిచేయకుండా బతకలేనంటూ టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్!
గత కొన్నాళ్లుగా టాలీవుడ్ నటి ప్రగతి (pragathi)పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

దిశ, సినిమా: గత కొన్నాళ్లుగా టాలీవుడ్ నటి ప్రగతి (pragathi)పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకుంది. తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల మనుసులు గెలుచుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయిన ప్రగతి.. హైపర్ యాక్టివ్‌గా ఉంటూ, ఫిట్‌నెస్, జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్‌తో యువతకే షాక్ ఇస్తున్నారు. ఇటీవల ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంనిటీషన్‌లో పాల్గొని ఏకంగా నాలుగు సిల్వర్ పతకాలు సాధించి సెన్సేషనల్‌గా మారింది.
ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ప్రగతికి వైవాహిక జీవితం అంత సాఫీగా సాగకపోవడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. అయితే కొడుకు, కుమార్తె ఉన్న ప్రగతి తనకు నచ్చింది చేస్తూ..సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల ఆమె పై ట్రోల్స్ రాగా.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే.. ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు పుకార్లు జోరందుకున్నాయి. తాజాగా, ఈ విషయంపై ప్రగతి స్పందించింది. ‘‘జీవితంలో ఒక తోడు అవసరమే. కానీ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయి ఉండాలి. నా మెచ్యూరిటీ లెవల్‌కు సరిపడే వ్యక్తి దొరకకపోతే మళ్లీ జీవితం కష్టంగా మారుతుంది.
పెళ్లయ్యాక నువ్వు అలా ఉండు.. ఇలా ఉండే అని కండిషన్లు పెడితే నేను భరించలేను. ఒకవేళ నాకు 20 ఏళ్లు ఉంటే.. సర్దుబాటు అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నా వయసు, ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లి ఎలాంటి ఆశలు లేవు. నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటున్నాను. కొడుకు ఇప్పుడిప్పుడే వాడి ప్రపంచంలో వాడు బిజీబిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం చదువు పూర్తి చేసుకుని బెంగుళూర్ లో పని చేస్తున్నాడు. కూతురు యూఎస్ లో చదువుకుంటుంది. సొసైటీకి మంచి పిల్లలను ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. ఆ విషయంలో నేను గర్వంగా ఫీలవుతాను. ఇక నేను జీవితంలో పెళ్లి చేసుకోకపోయినా బతకగలను కానీ.. వర్కౌట్స్ చేయకుండా ఉండలేను’ అని చెప్పింది.
Read More..
నేను ఏఐ బాధితురాలినే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ టాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్






