న్యూడ్ ఏఐ చిత్రాలతో నరకం చూస్తున్నా.. ప్రశాంతత కోల్పోయానంటూ జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-05 17:03:36  IST  )

అది డీప్‌ఫేక్ ఫోటోనో లేక మరేదో నాకు తెలియదు కానీ, ఒక పోర్న్ సైట్‌లో నా ఫోటో కనిపించింది.

న్యూడ్ ఏఐ చిత్రాలతో నరకం చూస్తున్నా.. ప్రశాంతత కోల్పోయానంటూ జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన టీనేజ్ రోజుల్లో ఎదురైన ఒక చేదు జ్ఞాపకాన్ని పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఒక పోర్న్ సైట్‌లో తన మార్ఫింగ్ ఫోటోను చూసి షాక్ అయ్యానని, ఆ చేదు అనుభవం తనను ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ, సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న చీకటి కోణాన్ని బయటపెట్టింది. "అది డీప్‌ఫేక్ ఫోటోనో లేక మరేదో నాకు తెలియదు కానీ, ఒక పోర్న్ సైట్‌లో నా ఫోటో కనిపించింది. అప్పుడు నేను స్కూల్ చదువుతున్నాను. మా ఐటీ క్లాసులో అబ్బాయిలు సరదా కోసం కొన్ని సైట్లు ఓపెన్ చేసేవారు. అలా చూస్తున్నప్పుడు నా ఫోటోలు అక్కడ ఉండటం చూసి చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పట్లో సెలబ్రిటీగా పుట్టినందుకు మనం చెల్లించాల్సిన మూల్యం ఇదేనేమో అని నా మనసును నేనే సర్దిచెప్పుకున్నాను" అని చెప్పుకొచ్చింది.

ఆ వయసులో అది తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె గుర్తుచేసుకుంది. అయితే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపంలో ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని జాన్వీ వాపోయింది. "ప్రస్తుతం ఏఐ చిత్రాల వల్ల నేను అస్సలు ప్రశాంతంగా లేను. నేను ఎప్పుడూ వేసుకోని బట్టలు, నేను ఎప్పుడూ ఇవ్వని పోజులతో నా ఫోటోలను సృష్టిస్తున్నారు. విచారకరమైన విషయం ఏంటంటే, కొన్ని అఫీషియల్ న్యూస్ పేజీలు కూడా ఆ ఏఐ చిత్రాలను నిజమని నమ్మి షేర్ చేస్తున్నాయి. ఇది నన్ను ఎంతగానో కలచివేస్తోంది" అని తన ఆవేదనను వెళ్లగక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ రొమాన్స్ చేయనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Read more.. నయనతారతో ఫోటో పెడితే చాలు.. నన్నైతే నాశనం చేస్తున్నారు.. విఘ్నేష్ శివన్ సంచలన వ్యాఖ్యలు

Next Story