నయనతారతో ఫోటో పెడితే చాలు.. నన్నైతే నాశనం చేస్తున్నారు.. విఘ్నేష్ శివన్ సంచలన వ్యాఖ్యలు!

by Mallepaka Hamsa |

అంతటి లెజెండ్‌కే తప్పనప్పుడు మనమెంత? ఇలాంటి నెగెటివిటీతో సహజీవనం చేయడం తప్ప మనకు వేరే మార్గం లేదు.

నయనతారతో ఫోటో పెడితే చాలు.. నన్నైతే నాశనం చేస్తున్నారు.. విఘ్నేష్ శివన్ సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, ప్రదీప్ రంగానాథన్, కృతి శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIC) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారని, నయనతారతో లేదా తన పిల్లలతో దిగిన సంతోషకరమైన ఫోటోలను షేర్ చేసినా కొందరు పనిగట్టుకుని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోనీని ఉదాహరణగా తీసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "గత ఐపీఎల్ సీజన్‌లో ధోనీ సరిగ్గా రాణించనప్పుడు కూడా జనం ఆయన్ని దారుణంగా ట్రోల్ చేశారు.

అంతటి లెజెండ్‌కే తప్పనప్పుడు మనమెంత? ఇలాంటి నెగెటివిటీతో సహజీవనం చేయడం తప్ప మనకు వేరే మార్గం లేదు" అని ఆయన చెప్పుకొచ్చారు. ట్రోలర్లు ఎప్పటికీ మారరని, అందుకే మనమే మారి అలాంటి విషయాలను లైట్ తీసుకోవడం నేర్చుకోవాలని విఘ్నేష్ తన ఫిలాసఫీని బయటపెట్టారు. తనపై వచ్చే ట్రోల్స్ గురించి భార్య నయనతారతో కలిసి సరదాగా నవ్వుకుంటామని విఘ్నేష్ తెలిపారు. "నీ పరిస్థితి పర్వాలేదులే.. నన్నైతే సోషల్ మీడియాలో పూర్తిగా నాశనం చేసేస్తున్నారు" అని ఆమెతో జోక్ చేస్తుంటానని ఆయన నవ్వుతూ చెప్పారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయినప్పటికీ, అదే సమయంలో 'LIC' వంటి మంచి కథ దొరకడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story