స్వతంత్ర భారతంలో మహిళలకు స్వేచ్ఛ లేదు.. హాట్ బ్యూటీ

by Disha Web Desk 22 |
స్వతంత్ర భారతంలో మహిళలకు స్వేచ్ఛ లేదు.. హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ హుమా ఖురేషి 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అభిమానులకు ప్రత్యేక సలహాలిచ్చింది. భారతీయులకు స్వేచ్ఛ అంటే ఎలా ఉంటుందో తెలియడానికి ఎన్నో ఏళ్లు పట్టిందన్న ఆమె అమరవీరుల త్యాగాలను నిరంతరం గుర్తుంచుకోవాలని చెప్పింది. అలాగే బ్రిటీష్ ప్రభుత్వం కారణంగా ఎన్నో ప్రాణ త్యాగాలు చేస్తేగానీ స్వాతంత్య్రం పొందాలేకపోయామన్న నటి ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులను రక్షించడాన్ని వ్యక్తిగత బాధ్యతగా భావించాలని కోరింది. అంతేకాదు మన సుఖసంతోషాలకోసం నెత్తురు దారబోసిన వీరులను స్మరించుకుంటూ మళ్లీ ఏ విదేశీ శక్తి మనల్ని పరిపాలించకుండా దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడాని కృషి చేయాలని పిలుపునిచ్చింది. చివరగా నేటి మహిళ కూడా శక్తివంతంగా ఎదుగుతుందనే విషయం గుర్తించాలన్న హుమా కొంతమంది పురుష గుండాలు స్త్రీని సెక్స్‌ వస్తువుగా భావిస్తూ దేశంలో హింసకు పాల్పడటం బాధకరమని, అలాంటి రోజులు త్వరలోనే అంతమై పోతాయంటూ ముగించింది.

మీ భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని డౌటా.. ఇలా కనిపెట్టేయండి


Next Story

Most Viewed