Ayesha Khan: నా పీరియడ్స్ మీకు నేషనల్ జోక్ అయిపోయిందా.. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా?

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-04 05:28:08  IST  )

మనం మన కొడుకులకు, అన్నదమ్ములకు ఈ విషయాల గురించి అవగాహన కల్పించాలి.

Ayesha Khan: నా పీరియడ్స్ మీకు నేషనల్ జోక్ అయిపోయిందా.. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా?
X

దిశ, సినిమా: గతేడాది విడుదలైన రణవీర్ సింగ్(Ranveer Singh) సినిమా ‘ధురంధర్’(Dhurandhar)లో అయేషా ఖాన్(Ayesha Khan), క్రిస్టల్ డిసౌజా కలిసి ఒక హిట్ సాంగ్‌లో మెరిశారు. కరాచీ వెడ్డింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాట షూటింగ్ సమయంలో తనకు పీరియడ్స్ ఉన్నాయని, ఆ నొప్పిని భరిస్తూనే చాలా కష్టపడి డ్యాన్స్ చేశానని అయేషా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తూ ఎగతాళి చేశారు. తాజాగా, ఈ విషయంపై అయేషా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ‘‘ప్రస్తుత రోజుల్లో ప్రతి విషయాన్ని జోక్ చేయడం, డార్క్ హ్యూమర్ పేరిట నవ్వుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అన్నిటికీ నవ్వడం మంచిది కాదు. పీరియడ్స్ అనేది ప్రతి నెల మహిళలకు వచ్చే సహజమైన ప్రక్రియ. ఆ సమయంలో కూడా మేము ఎన్నో పనులు చేస్తుంటాం. నాకు అది పెద్ద విషయంగా అనిపించలేదు కాబట్టే ఇంటర్వ్యూలో మామూలుగా చెప్పాను.

కానీ వారం రోజుల తర్వాత చూస్తే నా కామెంట్ ఒక నేషనల్ జోక్ అయిపోయింది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ జోకులన్నీ మగవాళ్లే వేసి ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘మనం మన కొడుకులకు, అన్నదమ్ములకు ఈ విషయాల గురించి అవగాహన కల్పించాలి. ‘ఆదిత్య ధర్ పీక్ డీటెయిలింగ్ ఇచ్చారు’ అంటూ నా పీరియడ్స్ మీద జోకులు వేయడం చాలా దారుణం. కానీ నేను సిగ్గుపడటం లేదు. పీరియడ్స్ టైమ్‌లో అంత కష్టపడి డ్యాన్స్ చేసినందుకు నేను గర్వపడుతున్నాను. మీరు ఆ సమయంలో అసలు కదలలేరు కూడా’’ అంటూ ఆమె ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. కాగా.. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఈ వెడ్డింగ్ సాంగ్‌ను శాశ్వత్ సచ్‌దేవ్ కంపోజ్ చేయగా, మధుబంతి బాగ్చీ, జాస్మిన్ శాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఈ సాంగ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

మనుషుల కంటే అడవే నయం.. మాళవిక మోహనన్ సంచలన వ్యాఖ్యలు

Next Story