గుప్పెడంత మనసు : నవంబర్ 18 ఎపిసోడ్ లో ఇంటర్వ్యూ కు అటెండ్ అవుతున్న వసుధార !

by Disha Web Desk 10 |
గుప్పెడంత మనసు  : నవంబర్ 18 ఎపిసోడ్ లో ఇంటర్వ్యూ కు అటెండ్ అవుతున్న వసుధార !
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్లు హైలెట్

మహేంద్రా " మనం ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం " అని జగతి అంటుంది. 'జగతీ నన్ను అర్థం చేసుకో.. మనం కోరుకునేది ఇది కాదు.. కొంత కాలం ఓపిక పట్టు' అని మహేంద్ర అంటాడు. మహేంద్ర నువ్వు ఏమైనా చెప్పు నేను 'ఈ విషయంలో మీకు సపోర్ట్ చెయ్యనని జగతి అంటుంది. జగతి వెళ్లకు ..నువ్వు నన్ను అర్ధం చేసుకుంటావ్ అనుకున్నా కానీ నువ్వు కూడా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

వసు ఇంటర్వ్యూకి రెడీ అవుతుంది. అప్పుడే రిషి, వసు దగ్గరికి వస్తాడు.సార్ 'జగతీ మేడమ్ వస్తారు కదా?' అని వసు అడగగా..అప్పుడు రిషి వస్తారని నమ్మకం ఉంచుకో వసుధార అని అంటాడు. జగతి మేడమ్ నేను పంపిన మెయిల్ చూస్తే నా కోసం వస్తారని వసు అనుకుంటుంది. ఇంటర్వ్యూ వెళ్ళే కంగారులో వసు బొట్టు పెట్టుకోవడం మరిచిపోతుంది. ఈ సీన్ను డైరెక్టర్ రొమాంటిక్ సీన్ గా మార్చాడు.

వసు , రిషి ఏకాంతంగా ఉన్నప్పుడు.. అప్పుడే దేవయాని ఎంట్రీ ఇస్తుంది. 'నాన్నా రిషి' అంటూ అక్కడికి వచ్చి వాళ్ళ మూడ్ ను పాడయ్యేలా చేస్తుంది. రిషి బయటికి వచ్చి.. దేవయానితో కావాలని వసుకి విషెస్ చెప్పిస్తాడు. ఏ వసు నిన్ను దెబ్బ కొట్టే రోజు ముందు ఉంది.. ఆ రోజు మాత్రం తప్పకుండా నాదే అవుతుంది.

ఇంకా కొంత సేపటికి వసు 'జగతీ మేడమ్ గురించి గౌతమ్‌‌ను అడగాలని ఎంతో ఆశగా ఉంటుంది. కానీ గౌతమ్ వసుధారను పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పాపం వసు జగతి మేడమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి, వసుకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి తన క్యాబిన్‌‌‌‌కు తీసుకోని వెళ్తాడు. రిషి , వసు మనసును ఎంత మార్చాలనుకున్నా.. కానీ వసు మాత్రం జగతి గురించే ఆలోచిస్తుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి : Karthika Deepam (కార్తీక దీపం) : మోనిత అంతు చూస్తానన్న దీప !

ఇవి కూడా చదవండి: samantha ఒప్పుకుంటే 'యశోద' సీక్వెల్‌కు రెడీ.. మేకర్స్ ప్రకటన

Next Story

Most Viewed