- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది యాదృచ్ఛికమే.. 'లా' డిగ్రీ సంపాదించడంపై గుల్
బాలీవుడ్ నటి గుల్ పనాగ్ తన జీవితంలో జరిగిన యాదృచ్ఛిక సంఘటన గురించి వెల్లడించింది. ఆమె నటించిన 'గుడ్ బ్యాడ్ గర్ల్' వెబ్ సిరీస్ ఈ నెల 14 నుంచి సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

దిశ, సినిమా : బాలీవుడ్ నటి గుల్ పనాగ్ తన జీవితంలో జరిగిన యాదృచ్ఛిక సంఘటన గురించి వెల్లడించింది. ఆమె నటించిన 'గుడ్ బ్యాడ్ గర్ల్' వెబ్ సిరీస్ ఈ నెల 14 నుంచి సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ఇటీవలే న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందినట్లు తెలిపింది. అయితే ప్రస్తుత చిత్రంలో తను లాయర్ పాత్రలో కనిపించనుండగా.. నిజ జీవితంలోనూ అలాగే జరగడాన్ని దేవుని సంకేతంగా పేర్కొంది.
ఇక పూర్తిగా వినకుండానే ఈ మూవీ కథకు ఒకే చెప్పినట్లుగా గుల్ గుర్తుచేసుకుంది. ఇలాంటి పాత్ర తప్పకుండా చేయాలనుకోవడం, అంతలోనే 'లా' డిగ్రీ పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నప్పటికీ భవిష్యత్తులో లాయర్‌గా ప్రాక్టీస్ చేయబోనని స్పష్టం చేసింది. అంతేకాదు అభిషేక్ సేన్ గుప్తా డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. 'వ్యవస్థతో పోరాడుతున్న బలమైన మహిళలను ప్రతిబింబించే విభిన్న స్టోరీ' అని చెప్పింది.
ALSO READ : ముంబయిలో 'పానీపూరి' అస్సలు బాగుండదు : తాప్సీ






