- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబయిలో 'పానీపూరి' అస్సలు బాగుండదు : తాప్సీ
స్టార్ నటి తాప్సీ పన్ను తనకు ముంబయిలో ఉండటం అస్సలు ఇష్టం లేదంటోంది.

దిశ, సినిమా : స్టార్ నటి తాప్సీ పన్ను తనకు ముంబయిలో ఉండటం అస్సలు ఇష్టం లేదంటోంది.అంతేకాదు అక్కడి ఆహారం సరిపోవట్లేదనే కారణంగానే ఢిల్లీ వచ్చానంటూ ఫన్నీ కామెంట్స్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న 'హెచ్‌టి సిటీ అన్‌వైండ్ ఫుడ్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్'కు హాజరైన తాప్సీ.. అక్కడ 'గోల్ గప్పా' తింటూ సందడి చేసింది.
ఈ క్రమంలోనే ముంబయి వీధుల్లో లభించే చిరు తిండి గురించి మాట్లాడిన నటి.. అన్నీ బాగున్నప్పటికీ 'పానీపూరి'గా పిలిచే గోల్ గప్పా ఎప్పుడూ తినలేదని చెప్పింది. అలాగే 'ఒకటి బొంబాయి పానీ పూరిలా ఉంది. ఇందులో గోల్ గప్పాలు లేవు. నా అభిప్రాయం ప్రకారం ఇవి తినడానికి ఎవరూ ఇష్టపడరు' అంటూ తను గప్ చుప్ తింటున్న వీడియోలో సరదాగా కామెంట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈవెంట్ అక్టోబర్ 9 వరకు కొనసాగనుండగా పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నారు.
ALSO READ : ఇది యాదృచ్ఛికమే.. 'లా' డిగ్రీ సంపాదించడంపై గుల్






