ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వందమంది ఫైటర్లతో ఆ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలు

by I. Sairam |   (  Updated:2026-01-09 03:02:57  IST  )

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వందమంది ఫైటర్లతో ఆ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మిస్తున్నది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కర్ణాటకలోనూ విదేశాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం భాగ్యనగరంలో చిత్రీకరణ జరుగుతుంది. 1969 కాలంలో చైనా, బూటాన్‌, ఇండియా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని టాక్‌. ఈ షెడ్యూల్‌ కోసం ఓ భారీ ఫారెస్ట్‌ సెట్‌ని నిర్మించి, వందమంది ఫైటర్లతో ఆ సెట్‌లోనే యాక్షన్‌ సన్నివేశాలను ప్రశాంత్‌నీల్‌ చిత్రీకరించారని వినికిడి. దీంతో ఫ్యాన్స్ ఈసారి ఎన్టీఆర్ భీభత్సం చూస్తాము కావచ్చు అని అంటున్నారు. కాగా ఈ ఏడాది జూన్‌ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.

Read More..

ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోను.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్

Next Story