నేషనల్ అవార్డ్ నుంచి ఇంటర్నేషనల్ స్టేజ్ వరకు.. సుకృతి ఎదుగుదల చూసి మురిసిపోతున్న సుకుమార్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-17 05:53:14  IST  )

నీ డెడికేషన్, నిరంతర ప్రాక్టీస్, సంగీతంపై నీకున్న ప్రేమే నిన్ను ఈ రోజు అంతర్జాతీయ వేదికపై నిలబెట్టాయి. తండ్రిగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.

నేషనల్ అవార్డ్ నుంచి ఇంటర్నేషనల్ స్టేజ్ వరకు.. సుకృతి ఎదుగుదల చూసి మురిసిపోతున్న సుకుమార్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి మరోసారి వార్తల్లో నిలిచింది. చిన్న వయసులోనే ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు అందుకుని అందరి దృష్టని ఆకర్షించింది. ఇక ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోంది. నటనలోనే కాదు, పాటల్లోనూ తనకు తిరుగులేదని సుకృతి నిరూపించుకుంది. తాజాగా సుకృతి సౌత్ కొరియాలోని జేజు ద్వీపంలో జరిగిన ఒక గ్రాండ్ కాన్సర్ట్‌లో పాల్గొంది.

అక్కడ ఉన్న ఏఎమ్‌ఐఎస్ (AMIS) వేదికపై ఒక ఇంగ్లీష్ సాంగ్‌ను హాలీవుడ్ సింగర్స్ రేంజ్‌లో పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన సింగింగ్‌తో విదేశీ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసింది. సుకృతి స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన కూతురు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద అదరగొడుతుంటే సుకుమార్ ఎంతో గర్వపడ్డారు. సుకృతి పాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు. "నీ డెడికేషన్, నిరంతర ప్రాక్టీస్, సంగీతంపై నీకున్న ప్రేమే నిన్ను ఈ రోజు అంతర్జాతీయ వేదికపై నిలబెట్టాయి. తండ్రిగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.

ఒక తండ్రికి ఇంతకంటే ఏం కావాలి?" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సుకుమార్ సినిమాల్లో ఎంత పర్ఫెక్షన్ చూపిస్తారో, ఆయన కూతురు కూడా అదే స్థాయిలో ప్రతి రంగంలో రాణిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అటు నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్‌గా, ఇటు గ్లోబల్ సింగర్‌గా సుకృతి ఎదుగుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఆమె ఒక మల్టీ టాలెంటెడ్ స్టార్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖులు సైతం సుకృతిని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆస్కార్ వేదికపై ధర్మేంద్రకు అవమానం.. ఇది సిగ్గు చేటు అంటూ హేమమాలిని ఫైర్!

Next Story