మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-09 14:21:45  IST  )

ప్రేమ అంటే బంధించడం కాదు.. మిమ్మల్ని ఎదిగేలా ప్రోత్సహించి, మీకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే ప్రేమను కనుగొనండి.

మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: గత కొన్నేళ్లుగా తమ రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)ఒకటయ్యారు. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. అయితే, పెళ్లి తర్వాత ఒక నెటిజన్ వీరిద్దరి గురించి రాసిన ఒక ఆర్టికల్ రష్మికను అమితంగా కదిలించింది. ‘నిజమైన ప్రేమకు నిదర్శనం ఒకరినొకరు గౌరవించుకోవడమే.. అది వీరిలో కనిపిస్తుంది’ అంటూ ఆ నెటిజన్ రాసిన పోస్ట్ చూసి రష్మిక చాలా ఎమోషనల్ అయ్యారు. దీనిపై స్పందిస్తూ, ‘‘నా గురించి ఎంతో మంది ఎన్నో రాశారు, కానీ ఈ నోట్ చదువుతుంటే కలిగిన ఫీలింగ్ అద్భుతం. ఎంతో చెప్పాలని ఉంది కానీ మాటలు రావడం లేదు.

ప్రస్తుతం నేను నా సొంత ప్రపంచాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఉన్నాను. దాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రష్మిక ప్రేమ గురించి ఒక పవర్‌ఫుల్ పాయింట్ చెప్పారు. ‘‘ప్రేమ అంటే బంధించడం కాదు.. మిమ్మల్ని ఎదిగేలా ప్రోత్సహించి, మీకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే ప్రేమను కనుగొనండి’’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే, త్వరలోనే 'రణబలి' అనే పీరియడ్ యాక్షన్ డ్రామాలో కలిసి నటించబోతున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.

1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాళి’ కథ సాగుతుందని సమాచారం. ఇందులో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అనే ధైర్యవంతుడైన యోధుడి పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్ సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ‘రణబాలి’ చిత్రం థియేటర్స్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత విజయ్, రష్మిక చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

విజయ్ అసలు పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాడు.. షాకింగ్ విషయాలు చెప్పిన మేనమామ

Next Story