- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రైన మోహిత్ రైనా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్య
ప్రముఖ బుల్లితెర నటుడు మోహిత్ రైనా కుటుంబలో సంతోషం వెల్లివిరిసింది. 40 ఏళ్ల ఈ క్రేజీ నటుడు తండ్రయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బుల్లితెర నటుడు మోహిత్ రైనా కుటుంబలో సంతోషం వెల్లివిరిసింది. 40 ఏళ్ల ఈ క్రేజీ నటుడు తండ్రయ్యాడు. అతడి భార్య అదితి శర్మ నేడు శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మోహిత్ రైనా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. 'ఇప్పుడే మేము ముగ్గురం అయ్యాం. బేబీ గర్ల్ కి ఈ ప్రపంచంలోకి స్వాగతం చెబుతున్నాం' అని పోస్ట్ చేసి తన చిట్టి కుమార్తె లేలేత చేతిని పోస్ట్ చేశాడు. దీనితో సెలెబ్రిటీలు, అభిమానులు మోహిత్ రైనా, అదితి శర్మ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మోహిత్ రైనా, అదితి శర్మ గత ఏడాది ప్రైవేట్ గా జరిగిన వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. మోహిత్, అదితి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారంతోనే వీరి పెళ్లి జరిగింది. మోహిత్ బుల్లితెరపై పాపులర్ యాక్టర్. దేవోమ్ కా దేవ్ మహాదేవ్ అనే టీవీ సిరీస్ తో మోహిత్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అలాగే సినిమాల్లో కూడా పాపులర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన మోహిత్ దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కించిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
ఆ ప్రభావం నా కూతురు మీద పడనివ్వను: రణ్‌బీర్
- Tags
- Mohit Raina






