- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రభావం నా కూతురు మీద పడనివ్వను: రణ్‌బీర్
by Mallepaka Hamsa |
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్.. తన కూతురు రాహ కపూర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు..

X
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్.. తన కూతురు రాహ కపూర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాజాగా కరీనా కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ చాట్ షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘బొడ్డు తాడు తెంపిన వెంటనే నేను నా కూతురును ఎత్తుకున్నా. ఆ మధుర క్షణం నా లైఫ్‌లో పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ సమయంలో నేను ఆకాశంలో తెలియాడుతున్నట్లు అనిపించింది. ఒక తండ్రిగా ఈ దశని చాలా ఎంజాయ్ చేస్తున్నా’ అన్నాడు.
అలాగే మీడియా అటెన్షన్ గురించి చెబుతూ.. ‘ఓ నటుడిగా నాపై ఎప్పుడూ మీడియా ఫోకస్ ఉంటుంది. అది సహజం. కానీ ఆ ప్రభావం నా కూతురు మీద పడకూడదనుకుంటున్నా. వీలైనంతవరకూ రాహని మీడియాకి దూరంగా ఉంచాలని జాగ్రత్తలు తీసుకుంటున్నా’ అని వివరించాడు.
Next Story






