మెగా డాటర్‌ను వదలని ప్రీతమ్‌.. హగ్ అండ్ కిస్ అంటూ శ్రీజ కొణిదెల రీ పోస్ట్

by Disha Web Desk 17 |
మెగా డాటర్‌ను వదలని ప్రీతమ్‌.. హగ్ అండ్ కిస్ అంటూ శ్రీజ కొణిదెల రీ పోస్ట్
X

దిశ, సినిమా: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, శ్రీజ తన పర్సనల్ లైఫ్ ద్వారా ఎక్కువగా న్యూస్‌లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పటికే శ్రీజకి రెండు పెళ్లిళ్లు అయిన విషయం తెలిసిందే. మొదటి భర్తతో విడిపోయినప్పటికీ ఇప్పుడు రెండో భర్త కళ్యాణ్ దేవ్‌తో కూడా విడాకులు తీసుకున్నట్లు ప్రకటనలు వస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతం జుకల్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. గతంలో సమంత విడాకుల సమయంలో అతని పేరు బాగా వినపడింది. ఇప్పుడు అదే పేరు శ్రీజతో కూడా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న 'ఐ లవ్ యూ' అంటూ శ్రీజ ఇన్‌స్టా పోస్ట్‌కి ప్రీతమ్ ఇచ్చిన రిప్లై నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మళ్లీ తాజాగా అతడు శ్రీజతో దిగిన ఫోటోలను లవ్ సింబల్‌తో నెట్టింట పంచుకున్నారు. దీంతో ఆ స్టోరీ‌ని శ్రీజ కొణిదెల రీ పోస్ట్ చేస్తూ హగ్ అండ్ కిస్ అంటూ షేర్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్‌పై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.



Read More: ఆ విషయంపై క్షమాపణలు అడిగిన సామ్.. విజయ్ దేవరకొండ స్పందన ఇదే!


Next Story