ఆ విషయంపై క్షమాపణలు అడిగిన సామ్.. విజయ్ దేవరకొండ స్పందన ఇదే!

by Dishanational2 |
ఆ విషయంపై క్షమాపణలు అడిగిన సామ్.. విజయ్ దేవరకొండ స్పందన ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టార్ హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి మయోసైటీస్ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్న సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.. షూటింగ్‌లకు అటెండ్ అవుతోంది.

అయితే ఇటీవల సమంత కోలుకున్న తర్వాత వెంటనే సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ ఫ్యాన్స్ సామ్ పై మండిపడుతున్నారు.

ఎందుకంటే? శివనిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి మూవీలో విజయ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సామ్ మయోసైటీస్ వ్యాధి భారిన పడటంతో ఖుషి మూవీ షూటింగ్ ఆగిపోయింది. అయితే సామ్ మళ్లీ కోలుకోవడంతో ఖుషి మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ సమంత విజయ్ దేవరకొండ అభిమానులకు షాకిస్తూ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కోసం ముంబై బయల్దేరింది. దీంతో పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు సమంత పై మండిపడంతో సమంత వారికి సారీ చెప్పిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై తాజాగా విజయ్ స్పందించాడు. మేమంతా నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం. పూర్తి ఆరోగ్యంతో నవ్వుతూ తిరిగిరా అంటూ స్పందించారు.

Read More: మెగా డాటర్‌ను వదలని ప్రీతమ్‌.. హగ్ అండ్ కిస్ అంటూ శ్రీజ కొణిదెల రీ పోస్ట్


Next Story

Most Viewed