గేమ్ చేంజర్ మూవీ.. ఆ విషయంలో ఫ్యాన్స్ అసహనం

by Dishanational2 |
గేమ్ చేంజర్ మూవీ.. ఆ విషయంలో ఫ్యాన్స్ అసహనం
X

దిశ, వెబ్‌డెస్క్ : రామ్ చరణ్ మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఉండే ఎనర్జే వేరు. సినిమా రాబోతుంది అన్నప్పటి నుంచి, మూవీ విడుదలయ్యే వరకు ఆ సందడే వేరుంటుంది. అలాంటింది ఈ మధ్య రామ్ చరణ్ మూవీకి సంబంధించిన ఎలాంటి సందడి లేదు. ముఖ్యంగా గేమ్ చేంజ‌ర్ సినిమా విష‌యంలో అవేవి ప‌ట్ట‌డం లేదు. అస‌లు ఫ్యాన్స్ ఆవేద‌న కూడా మేక‌ర్ల‌కు ప‌ట్ట‌డం లేదు. శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ ఇప్పటికే హైప్ లెవల్‌కి వెళ్లాలి కానీ అలా జరగడం లేదు. ఖుషీ మూవీ వరస అప్డేట్స్‌తో ముందుకు వెళ్తోంది.

దీంతో మెగా అభిమానుల్లో అసహనం మొదలైంది. గేమ్‌చేంజ‌ర్ విష‌యంలో క‌నీసం చిన్న‌పాటి అప్‌డేట్లు కూడా రాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింటింగ్‌గా ఉన్నారు. ముందు సంక్రాంతికి రిలీజ్ అన్నారు. త‌ర్వాత సంక్రాంతికి రావ‌ట్లేదు.. స‌మ్మ‌ర్‌కు వాయిదా అంటున్నారు. ఇప్పుడు తీరా సీన్ చూస్తుంటే స‌మ్మ‌ర్‌కు కూడా వ‌చ్చేలా లేదు.వ‌చ్చే యేడాది ద‌స‌రాకు వెళ్లిపోతుంద‌ని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read More : మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మీ.. కుర్రాళ్ల క్రేజీ పోస్ట్‌లు

Next Story

Most Viewed