- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పావలా ఆదాయం కోసం కొట్టుకోవడం మానేయండి.. బన్నీ వాసు సెన్సేషనల్ పోస్ట్
టికెట్ రేట్లు విపరీతంగా పెంచేయడం వల్ల, వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీద భారం వేసి ఆ వసూళ్లను భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం తెలివితక్కువతనమేనని ఆయన విమర్శించారు.

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు పెట్టిన పోస్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయని సంబరపడిపోతున్న సమయంలో, ఆయన అసలు నిజాన్ని బయటపెట్టి అందరినీ ఆలోచింపజేశారు. సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి కదా అని మనం మురిసిపోతున్నాం, కానీ నిజానికి థియేటర్లకు వచ్చే సగటు ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయిందని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు విపరీతంగా పెంచేయడం వల్ల, వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీద భారం వేసి ఆ వసూళ్లను భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం తెలివితక్కువతనమేనని ఆయన విమర్శించారు. పెద్దచిత్రాల ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి, చిన్న సినిమాల ఆదాయం పావలాకు పడిపోయిందని ఆయన లెక్కలతో వివరించారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేది హీరోలే.
కానీ వారు ఒక్కో సినిమాకు రెండేళ్లు సమయం తీసుకుంటే, ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. ఇది ఇండస్ట్రీ మొత్తానికి నష్టం తెస్తుందని అన్నారు. మూవీ విడుదలైన 27 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంటే, ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారు? అని ప్రశ్నించారు. ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాలా? అనే సందేహం ప్రేక్షకులకు కలిగేలా కంటెంట్ ఉంటుందని చెప్పారు. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో తినుబండారాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవని అన్నారు. ఉన్న తక్కువ ఆదాయంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఎవరు ఎంత పంచుకోవాలి అని కొట్టుకోవడం వల్ల లాభం లేదని బన్నీ వాసు స్పష్టం చేశారు. అసలు ఆదాయం ఎందుకు తగ్గిందో గుర్తించి, పైన చెప్పిన కారణాలను సరిచేయకపోతే భవిష్యత్తులో ఇండస్ట్రీ మరింత కష్టాల్లో పడుతుందని ఆయన హెచ్చరించారు. మూల సమస్యను పరిష్కరించకుండా కేవలం వాదించుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన తేల్చి చెప్పారు.
సినిమా టికెట్ ధరల పెంపుపై ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంచలన ప్రకటన






