- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది.. సమంత ఎమోషనల్ పోస్ట్
మయోసైటిస్ వంటి అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న సమంత, ఇప్పుడు తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది.

దిశ, సినిమా: మయోసైటిస్ వంటి అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న సమంత, ఇప్పుడు తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ సక్సెస్ మూడ్‌లో ఉండగా, తన తదుపరి చిత్రం ‘మా ఇంటి బంగారం’ కోసం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సమంత షేర్ చేసిన వీడియోలో తన వ్యక్తిగత ఎదుగుదల, కష్టాలను ఎదుర్కొనే తీరును ప్రతిబింబించేలా వ్యాఖ్యలు చేసింది. "ప్రతి ప్రయాణం సవాళ్లతోనే మొదలవుతుంది. కానీ ఆ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మనలో అసలైన దమ్ అనేది నిర్మించబడుతుంది.
ధైర్యంగా ముందుకు సాగి, గమ్యాన్ని ముద్దాడాలనుకునే ప్రతి కలకు నా మద్దతు ఉంటుంది’’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ద్వారా టీమ్ ఇండియా క్రీడాకారులకు తన ప్రోత్సాహాన్ని తెలియజేసింది. ఏ రంగంలోనైనా గెలవాలంటే శారీరక శక్తితో పాటు మానసిక స్థైర్యం (DUM) కూడా చాలా అవసరమని ఆమె సందేశం ఇచ్చింది. సమంత మాటల్లోని గాంభీర్యం చూసి అభిమానులు "రియల్ లైఫ్ ఫైటర్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. సమంత సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవీస్' బ్యానర్‌పై వస్తున్న మొదటి చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాలో ఆమె మునుపెన్నడూ చూడని ఒక కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. సామ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇటీవల రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిత్యం పలు ఈవెంట్స్, వెకేషన్స్ అంటూ భర్తతో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.






