- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచం నీకు వ్యతిరేకంగా నిలిచినా నీకు తోడుగా నేనుంటా.. త్రిష షాకింగ్ పోస్ట్
ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా నిలబడినా.. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దక్షిణాది వెండితెర ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష గత రెండు దశాబ్దాలుగా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఈ చెన్నై సుందరి వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో త్రిష ప్రేమలో ఉందంటూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఇటీవల తమిళనాడు బీజేపీ ఎంపీ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. విజయ్(Vijay) రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. "విజయ్ ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి" అంటూ వ్యక్తిగత విమర్శలు చేయడం సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీనిపై త్రిష తీవ్రంగా ఘాటుగా స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై అసభ్యంగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు.
దీంతో ఈ వివాదానికి బ్రేక్ పడింది. ఈక్రమంలో.. తాజాగా, త్రిష తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "ఏం జరిగినా.. మనం ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నా.. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా నిలబడినా.. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను" అని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆమె డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే స్క్రీన్ షాట్స్ తీసిన నెటిజన్లు దీనిని విజయ్ ను ఉద్దేశించి చేసినదేనని బలంగా నమ్ముతున్నారు.
త్రిష చేసిన ఈ పోస్ట్ తో వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని, అంతకు మించి ఏదో ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వేళ, ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ఈ వ్యవహారాన్ని వాడుకుంటున్నారని విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, త్రిష మాత్రం తనపై ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తూ తన మద్దతును విజయ్‌కి ఇండైరెక్ట్‌గా తెలుపుతోంది. మొత్తానికి త్రిష పోస్ట్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
‘నన్ను క్షమించు.. ఇంకోసారి రిపీట్ అవ్వదు’: త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత






