- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నన్ను క్షమించు.. ఇంకోసారి రిపీట్ అవ్వదు’: త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత
టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్, నటి త్రిషపై తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్, నటి త్రిష(Heroine Trisha)పై తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్(Nainar Nagendran) క్షమాపణలు చెప్పారు. సోమవారం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా మాట్లాడి ఉండాల్సింది కాదని.. పొరపాటు జరిదిందని పేర్కొన్నారు. ఇంతటితో ఈ వివాదం ముగించాలని కోరారు.
అసలు ఆయన ఏమన్నారంటే.. ‘పాపం విజయ్‌కు రాజకీయాల్లో అనుభవం లేదు. ముందు ఆయన త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలి’ అంటూ విమర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారాన్నే రేపాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా ఈ వివాదంపై నటి త్రిష సైతం స్పందిస్తూ.. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అనవసర వివాదాల్లోకి నన్ను లాగొద్దు. రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇలా మాట్లాడతారని ఊహించలేదు. పొలిటికల్ పార్టీల విషయంలో నేనేప్పుడూ తటస్థంగానే ఉన్నాను. నటన ద్వారానే నేనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. మరోసారి ఇలా నాపై వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటా’ అని త్రిష హెచ్చరించారు. దీంతో నాగేంద్రన్ స్పందించి సారీ చెప్పారు. ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందో లేదో చూడాలి.






